జి మాడుగుల(విశాఖసమాచారం):- అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం పరిధి ఈదులపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో అకస్మికంగా తనిఖి చేసినట్టు అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. డి కృష్ణమూర్తి నాయక్ తెలియజేసారు..
అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో గడిచిన రెండు రోజుల నుండి మొంథా తుఫాన్ ప్రభావం అధికంగా ఉండుట వలన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యాధికారులు మరియు వైద్య సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ముందుగా అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించి విధులకు హాజరుకాని ల్యాబ్ టెక్నీషియన్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఆరోగ్య పర్యవేక్షకురాలు డిప్యుటేషన్ ను రద్దుచేసి తిరిగి రప్పిచనున్నట్టు తెలిపారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అన్ని వార్డులని పరిశీలించి సుఖ ప్రసవానికి వచ్చిన ఇద్దరు. గర్భిణి స్త్రీలతో ముచ్చటించారు. అప్పుడే ప్రసివించిన గర్భిణిని పరిశీలించారు మగబిడ్డ బరువును పరిశీలించారు 3.5 కే.జిలు ఉండటంతో సంతృప్తి వ్యక్తం చేసారు. తల్లిపాల ప్రాముఖ్యత గూర్చి వివరించరు.కాన్పునకు సిద్దంగా ఉన్న గర్భిణిలను సుఖ ప్రసవాల కోసం బర్త్ వెయిటింగ్ హాల్‌కి తక్షణమే తరలించాలని, గర్భిణి స్త్రీలు, బాలింతలు, శిశువులు, అత్యంతర ప్రమాదకర కేసులను గుర్తించి సురక్షిత ప్రదేశంలో బద్రంగా ఉండునట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. గర్భిణి లను సకాలంలో గుర్తించి నమోదుచేయాలని, మాతా శిశువులకు నిర్దేశించిన సమయానికి వ్యాధి నిరోధక టీకాలు అందించాలని ఆన్ లైన్ సేవలను అప్డేట్ చేయించాలని అన్నారు. స్కూల్ హెల్త్ కార్యాక్రమం ద్వార విద్యార్ధులకు స్క్రీనింగ్ నిర్వహించి సకాలంలో వ్యాధులను గుర్తించి చికిత్సలు అందించాలని, ఎన్.సి.డి. సి.డి కార్యాక్రమం ద్వార సర్వేలు సక్రమంగా జరుగునట్లు వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
పి.హెచ్.సి పరిశుబ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వైధ్యాధికారికి సూచించారు. అనంతరం ల్యాబ్ ను పరిశీలింఛి రోజువారిగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలను పరిశీలించారు. నమోదైన మలేరియా కేసుల వివరాలను, మలేరియా రోగులకు అందించిన చికిత్స గూర్చి వైద్య సిబ్బందికి అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో 5 మంది జ్వర లక్షణాలు నమోదైన వెంటనే వైద్య శిభిరాలు ఏర్పాటు చేయాలని వైధ్యాధికారులకు ఆదేశించారు. పి.హెచ్.సిలో అందుబాటులో ఉన్న మందులను పరిశీలించి మలేరియా, డయేరియా, టైఫాయిడ్ మరియు ఇతర వ్యాధులకు సంబందించిన అత్యవసర మందులను, అన్నిరకాల వ్యాధినిరోధక టీకాలు, కుక్కకాటు, పాముకాటు వ్యాక్సిన్ లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పి.హెచ్.సి లో అందుబాటులో ఉన్న అన్ని రికార్డులను పరిశీలించారు.గ్రామ స్ధాయిలో వ్యాధులు సంబవించినపుడు ఆశా కార్యకర్త తక్షణమే స్పందించి సిబ్బందికి సమాచారం అందించాలని అన్నారు. క్షేత్ర స్ధాయి సిబ్బంది ఇంటింటి సందర్సనల ద్వార రోగులను సకాలంలో గుర్తించి చికిత్సలు అందించుట, మాతా శిశువులకు సమయానికి వ్యాక్సిన్లు చేసి సేవల రిపోర్టులను సమయానికి వెబ్ పోర్టల్ లో పొందుపరచుట చేయాలని అన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలని విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా బారీ వర్షాలు, బలమైన గాలులు వీచే ప్రభావం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 27 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి వైద్యాధికారుల పర్యవేక్షణలో చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని ఆన్నారు. ఈరోజు నాటికి 108 అంబులెన్స్ లు మరియు ఐ.టి.డి.ఏ అంబులెన్స్ ల ద్వార మొత్తం 2064 మంది గర్భిణీలను మరియు రోగులను తరలించి వైద్య సేవలను అందించడం జరిగిందన్నారు.. వారిలో మొదటి ప్రససవం కొరకు ఉన్న గర్భిణిలు, ప్రమాదకర గర్భిణి లు మరియు సుఖ ప్రసవం కొరకు వేచిఉన్నవారు మొతం 127 మందిని సమీప ఆసుపత్రులకు తరలించడం జరిగిందని తెలియజేసారు.ఈ కార్యాక్రమంలో , జిల్లా కుష్టు, ఎయిడ్స్ మరియు జిల్లా క్షయ అధికారి డాక్టర్ ఎం కిరణ్ కుమార్ మరియు పి.హెచ్.సి ఈడులపాలెం వైద్యాధికారి మరియు వైద్య సిబ్బంది పాల్గున్నారు.
Leave A Comment