• Login / Register
  • Site Logo

    అంగన్వాడీ సిబ్బంది కి నిరంతరం శిక్షణలు ఇప్పించి సాంకేతికంగా బలోపేతం చెయ్యాలి

    ఆంధ్ర ప్రదేశ్
     కలెక్టర్ దినేష్ కుమార్. ... 

    పాడేరు(విశాఖసమాచారం):- జిల్లా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ఏ ఎస్ దినేష్ కుమార్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం కార్యక్రమాలపై మంగళవారం నాడు జిల్లా సమీక్ష మంగళవారం నాడు నిర్వహించారు. సిబ్బందికి నిరంతరం శిక్షణలు ఇప్పించి వారిని సాంకేతికంగా బలోపేతం చేయాలనీ అధికారులను ఆదేశించారు. సమావేశములో మహిళా శక్తి కేంద్రాలు , మహిళా పోలీస్ లను ఉపయోగించుకొని అంగన్వాడీ కేంద్రాలలోని పిల్లల శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం , పిల్లల యొక్క మానసిక ప్రవర్తన ఆధారంగా గ్రేడింగ్ చేయాలనీ విమెన్ డెవలప్మెంట్ మరియు చైల్డ్ వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలలోని పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించాలని , పరిసరాలను పరిశుభ్రoగా ఉంచాలని , బలహీనముగా ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కోరారు . మండల కేంద్రములో ఉన్నటువంటి సి డి పి వో లు , సూపర్ వైజర్ లు ఆకస్మిక పర్యటనలు చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం సక్రమంగా అందే విధముగా చేయాలని , స్టాక్ ఎంత ఉంది , రిజిస్టర్ లను నిర్వహిస్తున్నారా లేదా ,సిబ్బంది హాజరు పట్టీలను పరిశీలించాలని మండల ప్రత్యక అధికారులును, మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు . ఆధార్ కార్డు లేనటువంటి పిల్లలకు గ్రామ సర్పంచ్ వారి సహకారముతో ఆధార్ క్యాంపు లను నిర్వహించి ఆధార్ కార్డులను జనరేట్ చెయ్యాలన్నారు . పోషణ్ ట్రాకర్ యాప్ లలో కేంద్రానికి సoభందించిన సమాచారాన్ని నిరంతరం అప్లోడ్ చెయ్యాలని సిగ్నల్ సమస్యలను అధిగమించి పోషణ పంపిణీకి సంబంధించిన ఫేసియల్ రికాగ్నినైజేషన్ నమోదుచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమములో ఐ టి డి ఏ పి వో శ్రీ పూజ , చింతూరు పి వో అపూర్వ భరత్ , మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ డి హేమలతా దేవి ,డి ఎం అండ్ హెచ్ వో విశ్వేశ్వర నాయుడు , మెడికల్ బోర్డు మెంబర్ టి నరసింగరావు , ఫుడ్ సేఫ్టీ అధికారి గ్రీష్మశ్రీ , ఐ డి యస్ పి డి ఝాన్సీ భాయి , వివిధ మండలాల సి డి పి వో లు , సూపర్ వైజర్ లు, మండల అభివృద్ధి అధికారులు మరియు మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు .

    Download Main Image

    Leave A Comment