• Login / Register
  • Site Logo

    ముగిసిన ఏపీ మంత్రివర్గ భేటీ.. 13 అంశాలకు ఆమోదం

    ఆంధ్ర ప్రదేశ్
    అమరావతి: అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో మంత్రివర్గ సమావేశం ముగిసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న దాదాపు 13 బిల్లుల అంశాలకు ఆమోదం లభించింది. నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లోని వివిధ చట్టాలను సవరిస్తూ క్యాబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌ తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప మున్సిపాలిటీగా సవరణకు ఆమోదం తెలిపారు. ఓటర్ల జాబితా తయారీకి మరో మూడు తేదీలను ఖరారు చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం లభించింది. రాజధాని అమరావతి పరిధిలో గతంలో 343 ఎకరాలకు సంబంధించి ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్‌ వెనక్కి తీసుకునేందుకు క్యాబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
    Download Main Image

    Leave A Comment