• Login / Register
  • Site Logo

    విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ₹11,440 కోట్ల ప్యాకేజ్

    ఆంధ్ర ప్రదేశ్

    విశాఖపట్నం:
    విశాఖ ఉక్కు పరిశ్రమను (Visakhapatnam Steel Plant) కాపాడే దిశగా కేంద్రం–రాష్ట్ర ప్రభుత్వాలు ₹11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజ్ను ప్రకటించాయి. ఈ ప్యాకేజ్‌లో ₹10,300 కోట్లు ఈక్విటీ రూపంలో, మిగిలిన మొత్తం లోన్ రూపంలో మార్చే ప్రతిపాదనలున్నాయి. ఈ ఆర్థిక సహాయంతో ప్లాంట్‌ అప్పులు తగ్గి, కార్యకలాపాలు కొంత స్థిరపడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

    అయితే, మరోవైపు ఈ ప్యాకేజ్‌పై ఉద్యోగులలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్లాంట్‌లో ఉద్యోగులను తగ్గించే అవకాశం, కాంట్రాక్టు ఉద్యోగులపై ప్రభావం చూపే చర్యలు ఉంటాయని సమాచారం రావడంతో కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
    వారు “ప్యాకేజ్‌తోపాటు ఉద్యోగ భద్రతకు హామీ ఇవ్వకపోతే, విశాఖ స్టీల్ ప్లాంట్ నిజమైన పునరుజ్జీవనం జరగదు” అని పేర్కొంటున్నారు.

    విశాఖ ఉక్కు పరిశ్రమ 1982లో స్థాపించబడినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల గర్వకారణంగా నిలిచింది. ప్రస్తుతం దీని భవిష్యత్‌ దిశలో తీసుకున్న ఈ కీలక నిర్ణయాలు రాబోయే నెలల్లో ఏ మార్పులు తీసుకురావబోతాయో చూడాలి.


    Download Main Image

    Leave A Comment