• Login / Register
  • Site Logo

    స్వర్ణఆంధ్రా దిశగా భారీ ప్రణాళికలు – కోస్ట్లైన్‌పై ప్రతి 50 కి.మీకి ఒక పోర్ట్

    ఆంధ్ర ప్రదేశ్

    విశాఖపట్నం:
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దాలనే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన దృష్టికోణాన్ని వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగిన East Coast Maritime & Logistics Summit లో ఆయన ఈ ప్రణాళికలపై కీలక వివరాలు తెలియజేశారు.

    ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రానికి ఉన్న 1,053 కిలోమీటర్ల సముద్రతీరంను సంపూర్ణంగా వినియోగించుకునే విధంగా ప్రతి 50 కి.మీకి ఒక పోర్ట్ నిర్మించనున్నట్లు ప్రకటించారు. పోర్ట్‌లతో పాటు, విమాన, సముద్ర, రైలు, రోడ్ లాజిస్టిక్స్ వ్యవస్థలను సమన్వయపరిచే సమగ్ర రవాణా శ్రేణిని ఏర్పరచనున్నట్లు వివరించారు.

    అంతర్జాతీయ ప్రమాణాల మేరకు అభివృద్ధి చేయనున్న ఈ ప్రణాళికలో ఆధునిక సాంకేతికతలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డ్రోన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) లాంటి సాంకేతిక పరిజ్ఞానాలను లాజిస్టిక్స్ రంగంలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.

    అదే సమయంలో, దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్ రంగంలో ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని, విశాఖపట్నంలో ఎయిర్ కార్గో ఫోరం ఆఫ్ ఇండియా – ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ను ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

    ఈ దిశగా చేపట్టబోయే చర్యలు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి పునాది వేయడంతోపాటు, ఆంధ్రప్రదేశ్‌ను దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్ రంగంలో అగ్రగామిగా నిలిపేలా మారుతాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.



    Download Main Image

    Leave A Comment