పాడేరు/జి
మాడుగుల (విశాఖ సమాచారం):- ప్రభుత్వం పరిశుభ్రతను ప్రోత్సహించడానికి
స్వచ్ఛాంద్రా అవార్డులు ఏ ఎస్ ఆర్ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్
అన్నారు.పాడేరు డివిజనల్ పంచాయతీ అధికారి పి. యస్.కుమార్ అధ్యక్షతన వి.ఆర్.
ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రధాన కార్యక్రమంలో
కలెక్టర్ మాట్లాడుతూ,జిల్లాలో ప్రతీ ఒక్కరికి పరిశుభ్రత, పర్యావరణ
పరిరక్షణపై అవగాహన పెంచడం,స్వచ్ఛత లక్ష్యాలను సాధించడంలో ప్రజల
భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం,వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ పద్ధతులను
అవలంబించేలా ప్రోత్సహించడంపై ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ
అధికారులు,స్వచ్ఛంద సంస్థలు దృష్టి సారించాలని సూచించారు.
పారిశుధ్య
కార్మికులకు భీమా చేయించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.మరియు
జిల్లాలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించడం,
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ప్రతీ ఇంటి నుండి చెత్త సేకరణ, ఇంకుడు
గుంతల నిర్మాణం కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
గిరిజన
సహకార సంస్థ చైర్మన్ కిడారి.శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం
ప్రజారోగ్యం పై దృష్టి సారించిందనీ, గతంలో ఏర్పాటు చేసిన దోమలపై దండయాత్ర
నుండి నేటి స్వచాంధ్రా స్వర్ణాంధ్రా కార్యక్రమం వరకూ పారిశుధ్య నిర్వహణ
ద్వారా వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.జానపద కళలు
సృజనాత్మక
అకాడమీ చైర్మన్ గంగులయ్య మాట్లాడుతూ ఉప
ముఖ్యమంత్రి మరియు ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు , బహిరంగ
ప్రదేశాల పరిశుభ్రతపై దృష్టి సారించినట్లు చెప్పారు.ఐటిడిఎ ప్రాజెక్ట్
అధికారి శ్రీపూజ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణను ప్రతీ ఒక్కరూ సామాజిక
బాధ్యత గా తీసుకోవాలని సూచించారు.అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ మాట్లాడుతూ
పారిశుధ్య కార్మికులు నిజమైన రియల్ హీరోస్ అని ప్రస్తుతించారు.
జిల్లాలో
ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నిషేధం
వంటి రంగాలలో అద్భుతమైన కృషి చేసిన 38 సంస్థలకు/ వ్యక్తులకు ఈ అవార్డులు
బహుకరించారు.ఈ కార్యక్రమంలో పాడేరు ,జి.మాడుగుల, జి.కె.వీధి, చింతపల్లి,
మండల పరిషత్ అధ్యక్షులు, స్థానిక సర్పంచ్ ఉషారాణి, జిల్లా అధికారులు,
పాడేరు యం.పి.డి.ఓ తేజా రత్నం, వివిధ మండలాల సర్పంచులు, డిప్యూటీ
యం.పి.డి.ఓ.లు , పంచాయతీ కార్యదర్శులు, పారిశుధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో
పాల్గొన్నారు
Leave A Comment