• Login / Register
  • Site Logo

    మిరియాలు, పసుపు, అల్లం, చింతపండు ప్రాసెసింగ్ యంత్రాలకు దరఖాస్తులు ఆహ్వానం

    ఆంధ్ర ప్రదేశ్
    ఆర్గానిక్/ఇండిగాప్. సర్టిఫికేషన్ కొరకు 50 శాతం రాయితీ  

    జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్
    జి మాడుగుల (విశాఖసమాచారం):- కేంద్ర ప్రభుత్వం స్పైసెస్ బోర్డు సహకారంతో గిరిజన రైతులకు రాయితీపై మిరియాలు, పసుపు, అల్లం, చింతపండు వలిచే యంత్రాలు, శభ్రపరిచే యంత్రాలు పంపిణీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మిరియాలు వలవడానికి, ఎండబెట్టిన తరువాత శుభ్రం చేయడానికి ఉపయోగ పడే యంత్రాలను, పసుపు ఆవిరి పై ఉడకబెట్టు మరియు పోలిష్ చేయు యంత్రాలు, చింతపండు పిక్క తీసే యంత్రాలు మరియు అల్లం శుభ్రపరిచు, ముక్కలు చేసే, ఎండబెట్టే యంత్రాలు గిరిజన రైతులకు 75 శాతం రాయితీపై అందిస్తామన్నారు. ఈ యంత్రాలు, విద్యుత్తు, డీజిల్, పెట్రోల్ సహాయంతో పనిచేస్తాయన్నారు. ఈ యంత్రాలు తో పాటు మిరియాలు కోసే నిచ్చెనలు, టార్పాలిన్ షీట్స్ ను ఒక యూనిట్ గ రాయితీ లో అందిస్తునమన్నారు. మిరియాలు, అల్లం, పసుపు మరియు చింతపండు సాగు చేస్తున్న గిరిజన రైతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు(ఎఫ్ పి ఓ/ఎఫ్ పి సి/ఎం ఎ సి ఎస్) 90 శాతం రాయితీపై అందిస్తామన్నారు. 
    ఆర్గానిక్/ఇండిగాప్(ఇంద్గాప్) సర్టిఫికేషన్ కొరకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు(ఎఫ్ పి ఓ/ఎఫ్ పి సి/ఎం ఎ సి ఎస్) 50 శాతం రాయితీపై అందిస్తామన్నారు. రైతులకు వానపాముల ఎరువు తోట్టెలు కు (వెర్మి కంపోస్ట్ ట్యాంక్) 75 శాతం రాయితీని అందిస్తామన్నారు.
    ఐటిడిఏ పాడేరు లో స్పైసెస్ బోర్డు కార్యాలయం లో అక్టోబరు 25వ తేదీలోగా దరఖాస్తులను అందజేయాలని కోరారు. దరఖాస్తులకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, కులదృవీ కరణ పత్రం, బ్యాంకు పాసు పుస్తకం మొదటి పేజీ, పోడు పట్టా లేదా భూమి పట్టా జెరాక్స్ కాపీలను (కనీసం 25 సెంట్లు భూమి), తెల్ల రేషన్ కార్డు, మొబైల్ ఫోన్ నంబరు, 2 పాస్ పోర్టు సైజు ఫోటో లను దరఖాస్తులకు జత చేయాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలు కొరకు కార్యాలయ పనివేళ లో సంప్రదించాల్సిన నెంబర్ 8919475787 తెలిపారు. ఈ అవకాశాన్ని రైతుల అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


    Download Main Image

    Leave A Comment