• Login / Register
  • Site Logo

    మినుములురు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాని తనిఖీ చేసిన జిల్లా వెధ్యాదికారి

    ఆంధ్ర ప్రదేశ్
     
     జి మాడుగుల(విశాఖసమాచారం):- అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం మినుములూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శనివారం నాడు డా. డి కృష్ణమూర్తి నాయక్శనివారం నాడు తనిఖీ చేశారు.మినుములూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ముందుగా అటెండెన్స్ ను మూమెంట్ రిజిస్టర్ ను పరిశీలించి. వైద్యంసేవలకు వచ్చిన రోగులను పరీక్షించి చికిత్సలు అందించారు. పి.హెచ్.సి కి వచ్చిన రోగులతో ముచ్చటించి గ్రామాలలో అధికంగా ప్రబలుతున్న రోగాలపైతమ ఆరోగ్య పరిస్థితి పై గ్రామాలలో క్షేత్ర స్ధాయి సిబ్బంది ఇంటింటి సందర్శనలు గూర్చి, అందిస్తున్న వైద్య సేవల గూర్చి రోగులకు అడిగి తెలుసుకున్నారు. పి.హెచ్.సి లో ఉన్న అన్ని వార్డులను మరియు ప్రసూతి గదిని క్షుణ్ణంగా పరిశీలించి అపరిశుభ్రంగా ఉండటంతో సంబందిత సిబ్బందిపై అసహనం వ్యక్తం చేసారు. కేటాయించిన బాధ్యతలు విధిగా నిర్వర్తించాలని విధులపై నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యర్ధాలను మరియు కాలం చెల్లిన మందులను కేటాయించిన ప్రదేశంలోనే ఖననం చేయాలని అన్నారు. సమయానికి విధులకు హాజరుకాని ఇద్దరు పర్యవేక్షణ సిబ్బంది మరియు ఒక స్టాఫ్ నర్స్ కు షోకాజ్ నోటిసు జారీచేశారు.. అనంతరం ల్యాబ్ ను పరిశీలింఛి రోజువారిగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలను పరిశీలించారు. ఇప్పటివరకు నమోదైన మలేరియా కేసుల వివరాలను, మలేరియా రోగులకు అందించిన చికిత్స గూర్చి అడిగి తెలుసుకున్నారు అన్ని రికార్డులను పరిశీలించారు. జ్వర లక్షణములతో వచ్చే రోగులకు జరుపు మలేరియా నిర్ధారణ రక్తపూతల నమోదు రికార్డును (యం.ఎఫ్ - 2) సక్రమంగా నిర్వహించని ల్యాబ్ టెక్నీషియన్స్ ను మందలించరు. పి.హెచ్.సి లో అందుబాటులో ఉన్న మందులను పరిశీలించారు మలేరియా, డయేరియా మరియు ఇతర వ్యాధుల అత్యవసర మందులు, అన్నిరకాల వ్యాక్సిన్ లు కుక్కకాటు, పాముకాటు వ్యాక్సిన్ లను ముందస్తు ఇండేంట్లను పంపి సరిపడా మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఫార్మసిస్ట్ కు సూచించరు.. 
     అల్లూరి జిల్లా పరిధిలో ఉన్న 64 పి.హెచ్.సిలను త్వరలో సందర్శించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటానని అందుకు వైద్యాధికారులు సిబ్బంది సమిష్టిగా కృషిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోరారు. ఈ కార్యాక్రమంలో పి.హెచ్.సి వెధ్యాధికారులు సిబ్బంది పాల్గున్నారు.


    Download Main Image

    Leave A Comment