• బీచ్ లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయనందున ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం.
విశాఖ నగర సముద్ర ప్రాంతంలో విద్యుత్ లైట్లను ఏర్పాటు
చేయాలని ఇప్పటికే పలుమార్లు ఆదేశించినప్పటికీ వాటిని ఏర్పాటు చేయనందున
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అధికారులపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం
ఆయన జోనల్ కమిషనర్ కె.శివప్రసాద్, పర్యవేక్షక ఇంజనీరు సంపత్ కుమార్ ,
ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ ఎన్ వి నరేష్ కుమార్ తో కలిసి ఆర్కే బీచ్
పరిసరాలను, పరిశుభ్రతను పరిశీలించారు.
ఈ
పరిశీలనలో నగర మేయర్ మాట్లాడుతూ విశాఖ సాగర తీరానికి అధిక సంఖ్యలో
సందర్శకులు, విహారయాత్రికులు, ప్రజలు ఎక్కువగా సందర్శిస్తున్నారని,
వారాంతరాలలో మరింత సందర్శకులు బీచ్ పరిసరాల్లో విహరిస్తున్నందున రాత్రి పూట
ఎక్కువ కాంతివంతమైన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని గత మూడు నెలల
క్రితమే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించడమైనదన్నారు. ఇప్పటికీ
కూడా విద్యుత్తు లైట్లను మార్పు చేయడం , కొత్తవి ఏర్పాటు చేయడం లో
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం
చేశారు. వారిపై చర్యలు తీసుకోమని ఇప్పటికే చాలాసార్లు ఉన్నతాధికారులకు
ఆదేశించడం అయినదని ,అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం
వహించడంపై మేయర్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్కే బీచ్ ఎన్టీఆర్ విగ్రహం
నుండి బీచ్ లో చాలా చోట్ల విద్యుత్తు లైట్లు, హైమాస్ట్ లైట్లు వెలగటం
లేదని , సందర్శకులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తనకు ఫిర్యాదులు
అందుతున్నాయని, ఎందుకు లైట్లను మార్పు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని
ఆరా తీసి ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, సిబ్బంది విధులను సరిగా నిర్వర్తించటం
లేదని వారికి నోటీసులను జారీ చేయాలని పర్యవేక్షక ఇంజనీర్ సంపత్ కుమార్ కు
ఆదేశించారు. ఈ విషయమై కమిషనర్ కు లేఖను రాసి తక్షణ చర్యలు చేపట్టాలని
సూచిస్తానని మేయర్ తెలిపారు.
అనంతరం
పారిశుద్ధ్య పనులను పరిశీలించి ఎంతమంది వర్కర్లు బీచ్ తీర ప్రాంతంలో
విధులు నిర్వహిస్తున్నారని శాంట్రీ ఇన్స్పెక్టర్ గోవిందరావును ఆరా తీశారు.
బీచ్ లో, బీచ్ తీర పరిసర ప్రాంతాల్లో వ్యర్ధాలు లేకుండా ఎప్పటికప్పుడు
వాటిని తొలగించి తరలించాలని, బీచ్ ను మరింత సుందరంగా తీర్చిదిద్దే చర్యలను
నిత్యం చేపట్టాలని ప్రధాన వైద్యాధికారి కి , జోనల్ కమిషనర్ శివప్రసాద్ కు
మేయర్ ఆదేశించారు.
ఈ
పరిశీలన కార్యక్రమంలో సిటీ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ రవికుమార్, ఉప
కార్యనిర్వాహక ఇంజనీర్ అన్నమనాయుడు , అసిస్టెంట్ ఇంజనీర్లు,వార్డు
ఎమినిటీస్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి ,
జీవీఎంసీ
Leave A Comment