అమరావతి:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం పై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య (PPP) పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రతిపాదనపై రాజకీయ, సామాజిక వర్గాలు, విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
విశేషంగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ఆరోగ్య వేదిక (PAV) ప్రతినిధులు, అలాగే విద్యార్థి సంఘాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు ఆరోగ్యరంగం ప్రజా ప్రయోజనాలను కాపాడే విధంగా ఉండాలని, లాభాల కోసమే నడిచే ప్రైవేటు రంగానికి అప్పగించడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య సేవలు అందని పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు.
ప్రతిపక్షాలు ప్రభుత్వం తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది, ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ పద్ధతి ద్వారా వైద్య విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని, మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయని వాదిస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారి, ప్రభుత్వ వైద్య విద్యా రంగ భవిష్యత్తుపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.
Leave A Comment