• Login / Register
  • Site Logo

    ప్రజల సహకారంతోనే స్వచ్ఛ ఆంధ్ర విజయవంతం అవుతుంది జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్

    ఆంధ్ర ప్రదేశ్
      అనకాపల్లి !విశాఖ సమాచారం బ్యూరో):-  ప్రజల సహకారంతోనే స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యం సాకారం అవుతుందని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. సోమవారం స్థానిక పెంటకోట కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు 2025 జిల్లాస్థాయి అవార్డుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచటం లో అహర్నిశలు శ్రమిస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు ప్రజలు సహకరించాలని తెలిపారు. పారిశుద్ధ్య కార్యక్రమంలో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్లు ఎంతో గౌరవనీయులు అన్నారు. గ్రామం శుభ్రంగా ఉంచడంలో గ్రామస్తుల భాగస్వామ్యం ముఖ్యమని, చెత్తను రోడ్లమీద, కాలువలలో వేయకుండా పారిశుధ్య సిబ్బందికి తడి చెత్త, పొడి చెత్తగా విడదీసి అందజేసి వారికి సహకరించాలని తెలిపారు. ప్రజలు ఇంటితోపాటు వారు నివసిస్తున్న వీధి, గ్రామం పరిశుభ్రత బాధ్యత కూడా తీసుకోవాలని తెలిపారు. కోవిడ్ వ్యాధి మనకు ఒక హెచ్చరిక అని, భవిష్యత్తులో అటువంటి మహమ్మారులు విజృంభించకుండా పరిసరాల పరిశుభ్రత ద్వారా ఎదుర్కోవాలన్నారు. విరివిగా మొక్కలు నాటాలన్నారు. జాతీయ, రాష్ట్రస్థాయిలో పథకాలు సాధించేందుకు కృషి చేసిన సిబ్బందికి, ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు పొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమమే కాకుండా మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యంలో సంస్కరణలు మొదలుపెట్టారని, పారిశుద్ధ్యనికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. గాంధీజీ స్ఫూర్తిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ స్వచ్ఛభారత్ స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ తాగునీరు సాగునీరు గ్రామీణ రంగాలకు అత్యధిక నిధులు మంజూరు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఓటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. పంచాయతీల ఆదాయం పెంచాలని, గ్రామాలలో చెరువులు ఆక్రమణలు గురికాకుండా గట్లపై కొబ్బరి తదితర చెట్లు పెంచి ఆదాయ మార్గాలు పెంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ సౌర విద్యుత్ పథకాన్ని వినియోగించుకొని ఆర్థికంగా లబ్ధి పొందటమే కాకుండా, పర్యావరణం సమతుల్యానికి కృషి చేయాలని కోరారు. మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ మహాత్మా గాంధీ పారిశుద్ధ్య ఉద్యమాన్ని తాను పాటించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. పరిసరాల పరిశుభ్రతకు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేనని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా రాత్రిపూట చెత్తలు తొలగించే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి దేశానికే మార్గదర్శకంగా నిలవడం జరిగిందన్నారు. మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్యమని తెలియజేసారు. చెత్తను సంపదగా మార్చుకోవాలని, చెత్త నుండి సహకరించిన పదార్థాలతో వేసిన రోడ్డు సీసీ రోడ్డు కంటే మూడు లేక నాలుగు రెట్లు జీవితకాలం ఎక్కువగా మండుతుందని తెలిపారు.పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ బహిరంగ మలవిసర్జన పూర్తిగా రూపుమాపుటకు ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు. పరిసరాల పరిశుభ్రతలో వ్యక్తిగత మరుగుదొడ్లు కీలక పాత్ర పోషిస్తాయని, అందువల్ల ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ ల చైర్మన్ లు, జిల్లా రెవెన్యూ అధికారి వై సత్యనారాయణ రావు, రెవెన్యూ డివిజనల్ అధికారి షేక్ ఆయిషా, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 

    Download Main Image

    Leave A Comment