• Login / Register
  • Site Logo

    పవన్ది అడుగడుగునా సామాన్యుడి పక్షం: సీఎం చంద్రబాబు

    ఆంధ్ర ప్రదేశ్
    అమరావతి, విశాఖ సమారామ్, ఆగస్టు:  జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు శు భాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. “పవన్ ది అడుగడుగునా సామాన్యుడి వక్షం.. అణువణువునా సామాజిక స్పృహ.. మాటల్లో పదును.. చేతల్లో చేవ.. మాటకు కట్టుబడే తత్వం.. జన సైన్యానికి ధైర్యం.. రాజకీయాల్లో విలువలకు పట్టం.. అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానులు, కార్యకర్తలు, ప్రజల దీవెనతో నిండు నూరేళ్లూ వర్థిల్లాలి.. మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి. పాలనలో, రాష్ట్రాభివృద్ధిలో మీ సహకారం మరువలేనిది” అని అన్నారు.

    పవన్ పీపుల్స్టార్ ఎదిగారు: నారా లోకేశ్

    వెండితెరపై అభిమానులను పవన్ కల్యాణ్ పవర్ స్టార్ అలరించారని మంత్రి లోకేశ్ అన్నారు. జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన పీపుల్ స్టార్ ఎదిగారని

    కొనియాడారు. ప్రజల కోసం తగ్గుతారు.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారని ప్రశంసించారు. సొంత తమ్ముడి కంటే ఎక్కువగా తనను పవన్ అభిమానిస్తారన్నారు. అండగా నిలుస్తున్న పవనన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని లోకేశ్ పేర్కొన్నారు.
    Download Main Image

    Leave A Comment