• Login / Register
  • Site Logo

    జగన్‌ పర్యటన ఉద్రిక్తం

    ఆంధ్ర ప్రదేశ్
    జగన్‌ పర్యటన ఉద్రిక్తం

    -జగన్‌ క్షమాపన చెప్పాలంటూ మహిళల నిరసన..
    -వారిపై రాళ్లదాడి.. పోలీసులతో సహా పలువురికి గాయాలు
     
     పొదిలి, విశాఖ సమాచారం:  పొగాకు బోర్డు వద్ద రైతులతో మాట్లాడేందుకు మాజీ సీఎం జగన్‌ వస్తున్న నేపథ్యంలో పొదిలిలో మహిళలు నిరసనకు దిగారు. మహిళలను కించపరిచిన వారిని జగన్‌ సమర్ధించారంటూ నల్ల బెలూన్లతోరథం రోడ్డులోని పీఎస్‌ఆర్‌ కాలనీ సమీపంలో  నిరసన తెలియజేశారు. జగన్‌ క్షమాపణ చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఏపీ మహిళలని దారుణంగా అవమానించిన కొమ్మినేని, సజ్జల, కృష్ణంరాజుని వెనకేసుకుని వస్తున్న జగన్‌.. సిగ్గు సిగ్గు.. అంటూ వారు నినాదాలు చేశారు.  అమరావతి మహిళలపై సాక్షి ఛానల్‌ డిబేట్‌లో చేసిన అసభ్య వ్యాఖ్యలను జగన్‌ ఖండిరచకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాకే ఆయన పొదిలిలో అడుగుపెట్టాలని డిమాండ్‌ చేశారు. ‘షేమ్‌..షేమ్‌ జగన్‌’, ‘భారతిరెడ్డి మౌనం వీడాలి’ తదితర నినాదాలు చేశారు. క్షమాపణ చెప్పాకే ఆయన పొదిలిలో అడుగుపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ కార్యకర్తలుగా చెబుతున్న కొందరు రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు మహిళలకు గాయాలయ్యాయి.  రాళ్లదాడిని ఆపేందుకు ప్రయత్నించిన ముగ్గురు పోలీసులు కూడా గాయపడడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ పరిస్థితులతో ఒక్కసారిగా జగన్‌ పర్యటన రణరంగంగా మారింది.
    Download Main Image

    Leave A Comment