• Login / Register
  • Site Logo

    చివరి రోజు మహానాడుకు పోటెత్తిన పసుపు సైన్యం

    ఆంధ్ర ప్రదేశ్
    చివరి రోజు మహానాడుకు పోటెత్తిన పసుపు సైన్యం 

    కడప, విశాఖ సమాచారం: మహానాడు బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి తెలుగు తమ్ముళ్లు కదం తొక్కారు. ఆశించిన మేర కన్నా అధిక సంఖ్యలో తరలిరావడతో కడప పరిసరాలు జనసంద్రంగా మారాయి. తెలుగుదేశం జెండా వాహనాలతో  రహదారులు కిటకిటలాడుతున్నాయి. మహానాడుకు సమీప గ్రామాల ప్రజలు ద్విచక్రవాహనాలు, కాలినడకన చేరుకున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సభా ప్రాంగణానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేశారు.

    భారీగా భోజన ఏర్పాట్లు..

    మహానాడు ప్రాంగణంలో 3 లక్షల మందికి సరిపడా భోజన ఏర్పాట్లు చేశారు. కార్యకర్తల కోసం కడప మార్గమధ్యంలో ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. దారిపొడవునా తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లతో దాహార్తి తీరుస్తున్నారు. ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ ప్రజలు తరలి రాలేదని అభిమానులు చెబుతున్నారు. ప్రజలు భారీగా రావడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటి సారిగా అభివర్ణిస్తున్నారు. దాదాపు 140 ఎకరాల సభా ప్రాంగణం మొత్తం ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఇసుకేస్తే రాలనంతగా పసుపు సైన్యం తరలివచ్చింది.
    Download Main Image

    Leave A Comment