• Login / Register
  • Site Logo

    అప్పన్న ఆలయ ప్రధానార్చకుడు రమణాచార్యులు కన్నుమూత

    ఆంధ్ర ప్రదేశ్
    అప్పన్న ఆలయ ప్రధానార్చకుడు
    రమణాచార్యులు కన్నుమూత

    సింహాచలం, విశాఖ సమాచారం: 
    శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయ ప్రధానార్చకుడు 2 ఇరగవరపు రమణాచార్యులు (58) గుండెపోటుతో మరణించారు. రెండు రోజుల కిందట ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు. సుమారు మూడున్నర దశాబ్దాల పాటు సింహాచలలేశుని పూజాది కైంకర్యాలలో విశేష సేవలందించిన రమణాచార్యులు అకాల మరణం పట్ల సింహాచలం దేవస్థానం ఉద్యోగులతో పాటు గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. 98 వార్డు పద్మావతి నగర్ లో నివాసముంటున్న ఆయన ఇంటికి వెళ్ళి  మృతదేహాన్ని పలువురు సందర్శించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సింహాద్రినాథుడు కుటుంబ సభ్యులకు ధైర్యాన్నివ్వాలని  ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.  సింహాచలం దేవస్థానం ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఏఈవో లు ఎన్ ఆనంద్ కుమార్, పిల్లా శ్రీనివాస్, మాజీ దర్మ కర్తలు గంట్ల శ్రీను బాబు, సూరిబాబు, కప్ప స్తంభము నాయుడు, ప్రసాద్ తదితరులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.. 
    అడవివరం శ్మశాన  వాటికలో అంత్య క్రియలు నిర్వహించారు.
    Download Main Image

    Leave A Comment