• Login / Register
  • Site Logo

    “లిటిల్ హార్ట్‌స్” విజయవంతంగా ప్రదర్శన – త్వరలో ఓటీటీలో

    వినోదం

    మౌళి, శివానీ నాగరం జంటగా నటించిన “లిటిల్ హార్ట్‌స్” చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. థియేటర్లలో ఎక్కువ కాలం కొనసాగిన ఈ సినిమా, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించింది.

    రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సింపుల్ స్టోరీ, ఫీల్‌గుడ్ ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకర్షించింది. ముఖ్యంగా మౌళి–శివానీ జంట కెమిస్ట్రీ, హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలు సినిమా విజయానికి ప్రధాన కారణమని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

    థియేటర్లలో సక్సెస్ సాధించిన తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్కి సిద్ధమవుతోంది. నిర్మాతలు ‘మీ ఫోన్ మీద ఒట్టు’ అనే ట్యాగ్‌లైన్‌తో ఓటీటీ ప్లాట్‌ఫారమ్ విడుదలను ప్రకటించారు. త్వరలోనే రిలీజ్ డేట్ మరియు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ వివరాలు వెల్లడించనున్నారు.

    “లిటిల్ హార్ట్‌స్” థియేటర్లలో మంచి రెస్పాన్స్ పొందడంతో, ఓటీటీలో కూడా మంచి ఆదరణ పొందే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.


    Download Main Image

    Leave A Comment